AP: తిరువూరు వార్ చల్లారినట్లు కనిపిస్తోంది. తిరువూరులో ఎమ్మెల్యే కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య గొడవ జరిగి వారం రోజులు దాటి పోయింది. అటు ఎమ్మెల్యే.. ఇటు ఎంపీ డైలాగ్ వార్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వారిని పిలిచి మాట్లాడేందుకు రెడీ అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సీఎం చంద్రబాబు విదేశాల నుంచి వచ్చే వరకు ఎంపీ, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు.