భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యత ఉంది. కొత్త ఇల్లు కట్టేటప్పుడు దేవాలయాలకు సమీపంలో ఇల్లు నిర్మించడం మంచిదా కాదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం దేవాలయానికి అతి సమీపంలో ఇల్లు నిర్మించడం మంచిది కాదని కొందరు వాస్తు నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఆలయం చాలా దగ్గరగా ఉంటే ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆలయ నీడ ఇంటిపై పడకూడదని, గుడికి నేరుగా ఎదురుగా ఇల్లు ఉండటం అంత శుభప్రదంగా పరిగణించరని, ధ్వజస్తంభం, గోపురం ప్రభావం కూడా ఇంటిపై పడకూడదని సూచిస్తున్నారు.