AP: 2029 ఎన్నికల్లో మావిగన్ రాజధాని ప్రతిపాదనగా తాము జనంలోకి వెళ్తామని
వైసీపీ అధినేత
జగన్ అంటున్నారు. మావిగన్‌ను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెడతామంటున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే కొత్త ఆల్టర్నేషన్‌ని తీసుకుని ప్రజల ముందుకొచ్చారు. ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండగా.. మావిగన్ ప్రతిపాదనతో
జగన్ రిస్క్ తీసుకుంటున్నారా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఏపీ ప్రజలకు రాజధాని అనేది ఒక సెంటిమెంట్. కూటమి అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి కేేంద్రంగా నిర్మాణ పనులు చేపడుతోంది. కానీ
జగన్ రాజధాని అంటూ మావిగన్‌ను తీసుకురావడం మాత్రం సాహసమనే చెప్పవచ్చు.