సాధారణంగా దోమతెరలను కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఒక వ్యక్తి వినూత్న పరిష్కారం చూపాడు. మంచాన్ని తిరగేసి, దానిపై పరుపు, దుప్పటి సర్ది, ఆపై దోమతెరను నాలుగు వైపులా తగిలించి లోపలికి వెళ్లి పడుకున్నాడు. ఈ వీడియో ఎక్స్‌లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు 'దోమలు ఓటమిని ఒప్పుకుంటాయి', 'అద్భుతమైన ఆలోచన' అంటూ ప్రశంసిస్తున్నారు. భారతీయుల ప్రతిభ అమోఘమని, నిజంగా ఇదొక అద్భుతమైన ఆలోచన అని మరికొందరు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.