తండ్రి మద్యం తాగే అలవాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పిల్లల్లో శారీరక, మానసిక లోపాలకు ఇది ప్రధాన కారణమని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితిని 'ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (FASD)' అంటారు. దీనివల్ల పిల్లల్లో ముఖం, దవడల ఆకృతి మారడం, కళ్లు చిన్నవి కావడం, మెదడు ఎదుగుదల మందగించడం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, గుండె సంబంధిత లోపాలు, మాటలు ఆలస్యంగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.