రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

85చూసినవారు
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
AP: దిత్వా తుఫాను బలహీనపడటంతో రాష్ట్రంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అయితే, తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో ఆ జిల్లాల్లో యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగనున్నాయి.

సంబంధిత పోస్ట్