ప్రస్తుతానికి చాందీపుర వైరస్‌కు ఎటువంటి వ్యాక్సిన్ లేదా ప్రత్యేక యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. వైద్యులు వ్యాధి లక్షణాలను తగ్గించడం, రోగి ముఖ్య అవయవాలను స్థిరంగా ఉంచడం ద్వారా చికిత్స అందిస్తారు. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే, ఐసీయూ సంరక్షణ ద్వారా బతికే అవకాశాలు అంత పెరుగుతాయి. అయితే, ఈ వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాపించదు. 2024 వ్యాప్తి సమయంలో మనుషుల మధ్య సంక్రమణ జరగలేదని డబ్ల్యూహెచ్‌వో కూడా స్పష్టం చేసింది. ఇది ఒక్క ఊరట కలిగించే విషయం.