AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ నేతలను కలవడానికి కూడా ఇష్టపడటం లేదని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కూటమి నాయకులు కేసులు పెడుతుండటంతో ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వంశీ బెయిల్‌పై విడుదలై గన్నవరంలోనే ఉంటున్నారు.