వైసీపీలోకి వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్?

0చూసినవారు
వైసీపీలోకి వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్?
AP: ఇటీవల వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రంగా కుమారుడు వంగవీటి రాధా గతంలో వైసీపీని వీడి టీడీపీలో చేరగా, తాజాగా రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లో చురుగ్గా మారారు. ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశాకిరణ్‌ను వైసీపీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ట్వీట్ చేశారని ఆశాకిరణ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్