అసలు వయసు కన్నా గుండె వయసు ఎక్కువ ఉంటే ప్రమాదమే?

8504చూసినవారు
అసలు వయసు కన్నా గుండె వయసు ఎక్కువ ఉంటే ప్రమాదమే?
మీ గుండె వయసు మీ అసలు వయసు కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదంలో పడినట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కార్డియోవాస్కులర్ ఏజ్ అనేది గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని తెలిపే కొలమానం. అధిక రక్తపోటు, డయాబెటిస్, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటివి గుండె వయసు పెరగడానికి కారణాలు. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో గుండె వయసును తగ్గించుకోవచ్చని వెద్యులు తెలిపారు. వ్యాయామం, సరైన ఆహారం, చెడు అలవాట్లకు దూరం, ఒత్తిడి లేని జీవితం, క్రమం తప్పకుండా చెకప్స్ చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్