ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. జట్టు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్న నేపథ్యంలో, ఆర్సీబీతో మ్యాచ్‌కు ఇషాన్ నాయకత్వం వహిస్తాడు. ఈ క్రమంలో, ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ కు అతి పిన్న వయసులో కెప్టెన్సీ చేపట్టిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతని వయసు 27 ఏళ్ల 253 రోజులు. సన్‌రైజర్స్ చరిత్రలో ఓవరాల్‌గా రెండో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా నిలిచాడు.