టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ నెం.1

9484చూసినవారు
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ నెం.1
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో 317 పరుగులు సాధించిన ఇషాన్, అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ మూడో స్థానంలో, తిలక్ వర్మ ఆరో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్