పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆదివారం, మార్చి 29న ఇస్లామాబాద్‌లో జరిగిన ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన భుజానికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయినట్లు ఆయన కుమారుడు అలీ దార్ తెలిపారు. నొప్పి ఉన్నప్పటికీ, పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఆయన రోజంతా కీలక దౌత్య సమావేశాల్లో పాల్గొన్నారు.