టాలీవుడ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తన తాజా చిత్రం ‘బైకర్’ సక్సెస్ ఇంటర్వ్యూలో నటి అమలతో కలిసి ఈ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘జాను’ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ చేస్తూ ప్రాణాపాయ స్థితిలో పడ్డా.. పరిశ్రమలో ఎవరూ పెద్దగా స్పందించకపోవడం బాధించిందని అన్నారు. 'నేను అంత తక్కువ వాడినా?' అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.