ధైర్యం, అహంకారం, శారీరక బలం గురించి మాట్లాడేటప్పుడు సింహాన్ని ఉదాహరణగా తీసుకుంటారని రచయిత చేతన్ భగత్ అన్నారు. కానీ నిజ జీవితంలో కొన్ని పరిస్థితులలో బొద్దింకలా వశ్యత కలిగి ఉండటం ప్రయోజనకరమన్నారు. కేవలం బాహ్య బలం సరిపోదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారగలగడమే (Adaptability) మనుగడకు ముఖ్యమని, దీనికి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఉదాహరణగా చూపారు. కెరీర్, ఉద్యోగాలలో, అలాగే వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ 'బొద్దింక సూత్రం' పాటించడం ద్వారా వృద్ధి సాధించవచ్చని ఆయన సూచించారు. .