AP: రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. ‘పరిశ్రమలు, పెట్టుబడులు,
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాం. ఆ సంకల్ప ఫలితంగానే నేడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించగలిగాం. ఈ చారిత్రాత్మక సందర్భంలో రాయలసీమ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.