తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు బ్రహ్మాజీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇవ్వడం మంచిది కాదని, వారికి కనీస భద్రత కల్పిస్తే సరిపోతుందని అన్నారు. మిగతాది ఖర్చు పెట్టుకోవాలని సూచించారు. ఉన్నది ఒక్కటే జీవితం అని, దానిని ఆస్వాదించాలని, ప్రపంచాన్ని చూడాలని, ఇతరులకు సహాయం చేయాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు.