పొరపాటున తొలగించిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందడం సాధ్యమని నిపుణులు తెలిపారు. ఫైళ్లను డిలీట్ చేసినప్పుడు అవి వెంటనే శాశ్వతంగా తొలగిపోవని, స్టోరేజ్‌లో ఖాళీగా గుర్తించబడతాయన్నారు. డిలీట్ చేసిన వెంటనే కొత్త ఫోటోలు తీయడం, యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం వంటివి చేయరాదన్నారు. ముందుగా 'రీసెంట్లీ డిలీటెడ్', 'రీసైకిల్ బిన్' ఫోల్డర్‌ను పరిశీలించాలని, అక్కడ 30 రోజుల వరకు ఫైళ్లు ఉంటాయని తెలిపారు. క్లౌడ్ బ్యాకప్ సేవలు, క్రమం తప్పకుండా బ్యాకప్‌లు తీసుకోవడం, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా డేటా నష్టాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.