AP: ప్రతి మనిషికి సొంతిల్లు ఉండాలనేది కల అని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘కూడు, గూడు, గుడ్డ.. మా విధానం. 40 ఏళ్లకు మునుపే పేదలకు పక్కా ఇళ్లకు శ్రీకారం చుట్టిన వ్యక్తి
ఎన్టీఆర్. ఆయన స్ఫూర్తితోనే పని చేస్తున్నాం. నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్, ప్రధాని
మోదీ నాడు విశాఖలో చెప్పిన విధంగానే పట్టాలు ఇచ్చి చూపిస్తున్నాం’ అని అన్నారు.