నా కూతుర్ని చంపి తొమ్మిదేళ్లు అయింది: సుగాలి పార్వతీ

31చూసినవారు
AP: కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ బుధవారం వీల్‌చైర్ యాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు, సుగాలి పార్వతీ బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా సుగాలి పార్వతీ మాట్లాడుతూ.. ‘నా కూతుర్ని చంపి ఇవాళ్టితో తొమ్మిదేళ్లు పూర్తి. అయినా న్యాయం జరగలేదు. నా కూతుర్ని చంపిన ముద్దాయిలను ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి చేపట్టిన వీల్ చైర్ యాత్రను అడ్డుకోవడానికి వందలాది మందిని పోలీసులను పెట్టారు’ అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్