ఒకప్పుడు సినిమా నిడివి రెండు, రెండున్నర గంటలు మించితే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యేవారు. కానీ, ఇప్పుడు కథలో దమ్ముంటే 3 గంటలు, అంతకంటే ఎక్కువ నిడివి ఉన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 'రంగస్థలం', 'పుష్ప', 'అర్జున్ రెడ్డి', 'యానిమల్', 'పుష్ప 2', 'దురంధర్ 1', 'దురంధర్ 2' వంటి సినిమాలు నిడివి ఎక్కువగా ఉన్నా, వాటిలోని కంటెంట్, నటన, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాలు సాధించాయి. ఇది ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పును సూచిస్తుంది.