వర్షాకాలంలో ఫోన్ తడిసినా లేదా నీటిలో పడిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్ తడిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, సిమ్, మెమరీ కార్డులు తీసేయాలి. పొడి గుడ్డతో తుడిచి, తేమను తొలగించడానికి బియ్యంలో 24-48 గంటలు ఉంచాలి. వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. 48-72 గంటల తర్వాతే ఆన్ చేయాలి. అప్పటికీ సమస్య ఉంటే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి.