నరసరావుపేట టీడీపీలో ఐవీఆర్ఎస్ సర్వే ప్రకంపనలు

391చూసినవారు
నరసరావుపేట టీడీపీలో ఐవీఆర్ఎస్ సర్వే ప్రకంపనలు
AP: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యవహారశైలిపై టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2019లో వైసీపీ తరపున గెలిచి, అనంతరం టీడీపీలో చేరి నరసరావుపేట నుంచి రెండోసారి ఎంపీగా విజయం సాధించిన లావు, పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వినుకొండకు చెందిన మక్కెన మల్లిఖార్జునరావుకు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం లభించడం వెనుక ఎంపీ చొరవ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ పనితీరుపై పార్టీ అధిష్టానం సర్వే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్