AP:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లంటూ ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని, చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పుల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని, అవినీతి, దోపిడీ జరిగిందని ఆరోపించారు. పోలవరం ఎత్తు, నిర్వాసితుల ప్యాకేజీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంపై చంద్రబాబును
జగన్ ప్రశ్నించారు.