AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ సమావేశానికి ఆయన బొట్టు పెట్టుకుని హాజరయ్యారు. దీన్ని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా గుడి దర్శనాల సందర్భాల్లో తప్ప, ఇతర సందర్భాల్లో జగన్ బొట్టు పెట్టడం అరుదు. అయితే ఈ సమావేశానికి బొట్టుతో హాజరు కావడంతో ఆయన స్టైల్‌లో మార్పు వచ్చిందని, ఇది కొత్త రాజకీయ సందేశమా అనే కోణంలో వైసీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు.