ఒంగోలు ముఖ్య నేతలకు జగన్ పిలుపు

5403చూసినవారు
ఒంగోలు ముఖ్య నేతలకు జగన్ పిలుపు
AP: మాజీ సీఎం జగన్ మంగళవారం ఒంగోలులో పర్యటించి, ఇటీవల మరణించిన పార్టీ నేత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం ఈ నెల 30న పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి, స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో నేతలకు కీలక దిశానిర్దేశం చేయనున్నారు. రిజర్వేషన్ల ఖరారు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బలమైన అభ్యర్థులను నిలపాలని జగన్ సూచించనున్నారు.

సంబంధిత పోస్ట్