AP: వైఎస్ జగన్ నుంచి జనాన్ని దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. "రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతు కష్టాన్ని పొలంలోకి వచ్చి విన్నవాడు ఎవరూ లేరు. వ్యవసాయశాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నాడో తెలియదు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.