అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన ప్రజా దర్బారులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఒక వింత అనుభవం ఎదురైంది. ఉరవకొండ గ్రంథాలయం రికార్డుల్లో ఇటీవల పుస్తకాలు చదివిన వారి జాబితాలో జగన్, చంద్రన్న, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు దివంగత నేత పరిటాల రవి పేర్లు కనిపించడంతో మంత్రి ఆశ్చర్యపోయారు. గ్రంథాలయ ఉద్యోగి ప్రతాపరెడ్డి రోజుకు 50-60 మంది వస్తున్నారని చెప్పడంతో అనుమానం వచ్చిన మంత్రి రికార్డులు పరిశీలించి, ఈ పేర్లు చూసి షాక్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేస్తూ, రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని పోలీసులను ఆదేశించారు.