AP: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనను ఆ పార్టీ అధినేత జగన్ ఖండించారు. శనివారం ఎక్స్ వేదికగా.. ‘వైసీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు దాడి చేశారు. ఇది వైసీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేయడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది’ అని ట్వీట్ చేశారు.