బెంగళూరులో కూర్చొని జగన్ కుట్రలు: ఎంపీ కలిశెట్టి

15చూసినవారు
బెంగళూరులో కూర్చొని జగన్ కుట్రలు: ఎంపీ కలిశెట్టి
AP: బెంగళూరులో కూర్చొని మాజీ సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. ఈ కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. జగన్ కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తానన్నారు. వైసీపీ ఎంపీల ఆస్తులు విపరీతంగా పెరిగాయన్నారు. దానిపై ఆ పార్టీకి చెందిన సహచర ఎంపీలే ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న పనులు వీడియోలన్నీ తీసి జగన్‌కు పంపుతున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్