AP: ప్రజలకు నచ్చేది వైసీపీ అధినేత జగన్‌కు నచ్చదని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. గతంలో సుదీర్ఘకాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతలు రోడ్ల మీదకు వచ్చేవారని, ప్రస్తుతం ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం నేతలు రోడ్డు మీదకు వస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ప్రజల్లో మంచి అభిప్రాయం లేకుండా పోయిందన్నారు.