మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ సీఎం జగన్ ఖండించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అరెస్ట్ చేశారని నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడటంతో చంద్రబాబు అండ్ కో తప్పించుకోవడానికి ఈ కుట్రకు పాల్పడ్డారని ట్వీట్ చేశారు. మీ ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని సీఎంను ప్రశ్నించారు. మీ జేబులో ఉన్న సిట్ మీరు ఎం చెబితే అది చేస్తుందని మీ మాఫియా వ్యవహారాల మీద మిరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా అని ఎద్దేవా చేశారు.