జగన్‌కు మానసిక సమస్య ఉంది: సీఎం చంద్రబాబు

12972చూసినవారు
జగన్‌కు మానసిక సమస్య ఉంది: సీఎం చంద్రబాబు
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని, కోడికత్తి, గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు. ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని, అలా చేయడమే ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఆయన మానసిక పరిస్థితి అందరినీ మోసం చేయడమేనని, ఆ తర్వాత మాట మార్చడమే పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు.

సంబంధిత పోస్ట్