అమరావతిపై ప్రకటనలు చేసి జగన్‌ నవ్వుల పాలవుతున్నారు: యనమల

26చూసినవారు
అమరావతిపై ప్రకటనలు చేసి జగన్‌ నవ్వుల పాలవుతున్నారు: యనమల
అమరావతిపై జగన్‌ చేస్తున్న అసంబద్ధ వ్యాఖ్యలతో ఆయనే నవ్వుల పాలవుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదం లేదనడం ఆయన అవగాహనారాహిత్యాన్ని చూపుతుందని అన్నారు. రాజధానిపై తరచూ మాటలు మార్చడం జగన్‌ గందరగోళాన్ని ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో రాజధానులు నదీ తీరాల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. అమరావతి అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతోనే జగన్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని యనమల ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్