సీఎం చంద్రబాబు చెబుతున్న అమరావతి ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్‌ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.