AP: రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు పునర్నిర్మిస్తుంటే జగన్‌కు కడుపుమంటగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం స్పందిస్తూ.. రాష్ట్రానికి రాజధాని లేకుండా నాశనం చేసింది జగనేనని మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని ఐదేళ్లు పక్కనపెట్టి అపహాస్యం చేశారన్నారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరిట నాటకమాడి, రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారన్నారు.