జగన్ మోదీకి దత్తపుత్రుడు: షర్మిల

18421చూసినవారు
జగన్ మోదీకి దత్తపుత్రుడు: షర్మిల
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ దత్తపుత్రుడని.. అందుకే ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడని ఆమె ఆరోపించారు. విజయవాడలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ మరణం వెనక రిలయన్స్ ఉందన్న జగన్.. మోదీ వల్లే వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని షర్మిల విమర్శించారు. జగన్‌ చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా..? అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్