AP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ అమరావతి రాజధాని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారనే వాదనలను
వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ ఖండించారు. మంగళవారం అమరావతి పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించిన అవినాష్,
జగన్ లేదా
వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకంగా లేదని తెలిపారు. మచిలీపట్నం, గుంటూరుతో పాటు అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం జగన్‌కు ఎప్పుడూ ఉండేదని పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో మళ్లీ
వైసీపీ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.