AP: మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనేనని, ఈడీ, సీబీఐ దర్యాప్తుతో భయపడి
జగన్ ధర్నాల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సొంత బాబాయ్ హత్య కేసులో సాక్ష్యాలను తుడిచిపెట్టిన చరిత్ర జగన్‌దని, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు తాడేపల్లి నివాసం వైపే వేలెత్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతోనే డీఎస్సీ వంటి అంశాలపై
వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు.