ఏపీకి రాజధాని లేకుండా చేయాలని జగన్ చూస్తున్నారు: మంత్రి గొట్టిపాటి (VIDEO)

5999చూసినవారు
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో మూడు రాజధానుల పేరుతో, ఇప్పుడు అమరావతి అంశంపై డ్రామాలు చేస్తూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఉద్రిక్తతలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని, అయితే వారిని అక్కడి రైతులే అడ్డుకుని తరిమికొట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్