AP: కాంగ్రెస్తో జట్టుకట్టేందుకు
జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలిగిన
జగన్.. ఆ తర్వాత ఓడిపోయినా బీజేపీకి మద్దతుగా నిలిచారు. కానీ దేశంలో ప్రస్తుతం మారుతున్న పరిస్ధితుల్లో
బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతుండటం, ఎన్నికల అక్రమాలకు తానే స్వయంగా ఏపీలో బాధితుడు కావడం వంటి అంశాలు జగన్ను మౌనంగా ఉండనీయడం లేదు. దీంతో ఎన్నికల అక్రమాలపై జాతీయ స్ధాయిలో గట్టిగా పోరాడుతున్న తన మాజీ పార్టీ
కాంగ్రెస్ నేతృత్వంలోని
ఇండియా కూటమివైపు
జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాదిలో ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో పటిష్టంగా మారిన
కాంగ్రెస్ పార్టీ.. ఏపీలోనూ
జగన్ ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.