వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4న కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మొంథా తుఫాన్ వల్ల జరిగిన భారీ పంట నష్టాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య రాజకీయ వైరం ఉన్న మచిలీపట్నం వైపుగా సాగడం, అలాగే జోగి రమేష్ అరెస్టు నేపథ్యంలో ఈ పర్యటన రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందోనని రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది.