AP: బీసీలు రాజకీయంగా ఎదగడం వైసీపీకి ఇష్టం లేదని మంత్రి సవిత విమర్శించారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు
వైసీపీ కోర్టుల్లో కేసులు వేసిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై న్యాయపోరాటం కొనసాగిస్తామని, బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని మంత్రి సవిత హెచ్చరించారు. జగన్కు ఇక రాజకీయ సమాధేనని వ్యాఖ్యానించారు.