గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన జగన్

54చూసినవారు
గాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన జగన్
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. "సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు" అని చెప్పడమే కాక.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు" అని వైఎస్‌ జగన్‌ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఈ ట్వీట్ ద్వారా గాంధీజీ జీవితాన్ని, ఆయన బోధనలను జగన్ గుర్తుచేసుకున్నారు.

ట్యాగ్స్ :