అమరావతిపై జగన్ అక్కసు: మంత్రి నారాయణ

2665చూసినవారు
అమరావతిపై జగన్ అక్కసు: మంత్రి నారాయణ
నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు  ఏపీ పట్టణాభివృద్ది శాఖామంత్రి పి.నారాయణ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు.  ఈ పనులు ఇక ఆగేలా లేవని భావించే అమరావతిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోమారు తన అక్కసును వెళ్లగక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని జిల్లాల్లో శరవేగంగా సాగుతున్న అభివృద్ధి పనులను చూసిన జగన్‍తో పాటు ఆయన పార్టీ నేతలంతా ఓర్వలేకపోతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్