జగన్ అరెస్ట్.. పవన్ సంచలన వ్యాఖ్యలు

44చూసినవారు
జగన్ అరెస్ట్.. పవన్ సంచలన వ్యాఖ్యలు
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసినప్పుడు జగన్ అరెస్ట్ గురించి ప్రస్తావరించారని ఇటీవల ప్రొ.నాగేశ్వర్ ఓ యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. జగన్ అరెస్ట్ అయితే తనకేం లాభమని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఎవరి అరెస్ట్ ద్వారానో లబ్ధి పొందే రాజకీయాలు చేయనని చెప్పారు. జగన్ అరెస్ట్ గురించి అమిత్ షా వద్ద ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరో జైలుకు వెళ్లినప్పుడు మాత్రమే తాను ఎదుగుతానా? అని పవన్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్