AP:
వైసీపీ అధినేత వైఎస్
జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయి 13 ఏళ్లు గడిచినా విచారణ ముందుకు సాగడం లేదని ఎంపీ చింతకాయల విజయ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.
జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు, జడ్జిల బదిలీల సాకుతో విచారణను జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పు చేసిన వారి కేసులను ఇప్పటి నుంచైనా విచారణ చేయాలని, ఇలాంటి కేసుల్లో సుదీర్ఘ జాప్యం వల్ల న్యాయవ్యవస్థలపై నమ్మకం పోతుందని, విచారణలో జాప్యం న్యాయం నిరాకరించినట్లేనని విజయ్ అన్నారు.