AP: వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ కోసం వేలంపాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేస్తే.. అది తప్పు, అన్యాయం అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.