ఎన్నికల సంఘంలో విభేదాలు.. జగన్ ఆందోళన

2369చూసినవారు
ఎన్నికల సంఘంలో విభేదాలు.. జగన్ ఆందోళన
AP: కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలపై వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని, అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుందని ఆయన అన్నారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు, ఓటర్ల జాబితాల నిర్వహణ వంటి అంశాలపై మీడియా కథనాలు ప్రజల్లో అనేక ప్రశ్నలకు దారితీశాయని, ఈ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్