AP: మాజీ సీఎం YS
జగన్ అక్రమాస్తుల కేసులోని వ్యాన్ పిక్ వ్యవహారంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. యూఏఈకి చెందిన 'రాకియా' సంస్థ నిధుల దారిమళ్లింపు వివాదంలో రెండు వారాల్లో రూ.200 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆస్తుల మార్పిడి లావాదేవీలపై అనుమానం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, పెండింగ్‌లో ఉన్న ఆస్తుల వసూళ్ల ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని హైదరాబాద్ వాణిజ్య న్యాయస్థానాలను ఆదేశించింది.